కరోనాసుర సంహారం

అమరావతి లో దేవేంద్రునిసభ జరుగుతోంది . 

 

దేవగురువు బృహస్పతి ఆధ్వర్యవం లో సభ నడుస్తూ ఉంది . 

అష్ట దిక్పాలకులు , నవ గ్రహాలు తో కలిసి అతి ముఖ్య సమావేశం జరుగుతోంది. 

అప్పటికే గూఢచర్యాన్ని సమర్ధవంతం గా నిర్వహించే త్రైలోక్య సంచారి నారద మునీంద్రుడు జరిగిన సంఘటనలను , జరుగుతున్న , జరగబోయే సంఘటనల పై ఒక ప్రత్యేక నివేదిక అందజేశాడు . 

ముక్కోటి దేవతలను వీడియో కాన్ఫరెన్స్ లోకి ఆహ్వానించారు దేవ గురువు బృహస్పతి . 

అమరేంద్రుని ప్రత్యేక ఆహ్వానం మేరకు త్రిమూర్తులు అప్పటికే గ్రూప్ చాటింగ్ కి వచ్చి నిరీక్షిస్తున్నారు . 

శచీదేవి ఆహ్వానం మేరకు  త్రిశక్తి కూడా మహిళా మండలి తరపున హాజరయ్యారు కూడా . 

సభలో వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి . 

ముందుగా యమధర్మరాజు  : 

దేవేంద్రా ప్రస్తుతం మర్త్యలోకం నుండి జీవుల రాక తగ్గిపోయింది . దానివలన నరకలోకం లో పనిలేక యమభటులు ఖాళీ గా కూర్చున్నారు . ప్రస్తుతం బడ్జెట్ కొరత కారణం గా నరకలోకం లో ఉన్న యమభటులకు ఆన్ పైడ్ లీవ్ తో పాటు ఉద్యోగాలలో కొంత కోత కూడా చేయదలచుకున్నాము .  మీ ఉత్తర్వులకోసం ఎదురుచూస్తున్నాము .

దేవేంద్రుడు బృహస్పతి వంక చూసి : 

ఆచార్యా ఏమిటి ఇది అకస్మాత్తుగా ఇంతటి సంక్షోభం .  మనం విధాత విరచించించిన జీవుల కర్మఫలాల రిజిస్టర్ ని బాగానే అనుసరిస్తున్నామా ? లేక మనకు తెలియని మార్పులు విధాత గానీ చేసారా ? అందుకు సంబంధించి సమాచారం మీ దగ్గరుందా ? 

అకస్మాత్తుగా ఆ ప్రశ్న వేసి తనవంక చూసిన బ్రహ్మ ఉలిక్కిపడి : 

దేవేంద్రా నా ప్రోగ్రామింగ్ లో ఏ లోపమూ లేదు , ఇది పూర్తిగా మీ నిర్వహణా లోపం  సుమీ . 

ఆ మాట అన్న బ్రహ్మ తమ వంక చూసి మద్దతు అడిగేసరికి హరిహరులు : 

దేవేంద్రా అవును నిజం మేము కూడా విధాత మాటలతో ఏకీభవిస్తున్నాము . ఇది పూర్తిగా నిర్వహణా వైఫల్యమే . 

దేవేంద్రుడు  బృహస్పతి తో :

ఆచార్యా ఏమిటిది మన వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం లేదా ?  మనం సరిగ్గా పాలిస్తామనే కదా ముక్కోటి దేవతలకూ హామీ ఇచ్చాము మన క్రితం మేనిఫెస్టో లో .మీరు వ్యవహారాలను సరిగానే నియంత్రిస్తున్నారా ? 

అంటూ ఒకసారి మిగిలిన గ్రహామండలి  వంక చూశాడు : 

సూర్యుడు : 

ప్రభూ నేను నా విధిని సరిగ్గానే నిర్వర్తిస్తున్నాను . 

చంద్రుడు : 

ప్రభూ నేను నా విధిని సరిగ్గానే నిర్వర్తిస్తున్నాను .  

అంగారకుడు , కుజుడు,  బుధుడు , శని : 

ప్రభూ మేమూ సరిగ్గానే మా విధులను నిర్వహిస్తున్నాము కానీ మాకు కూడా అందని వింత ఏదో జరుగుతోందని అనుమానం గా ఉంది . 

రాహువు కేతువు : 

ప్రభూ సమయానుకూలం గా మేము తీసుకుంటున్న చర్యలలో ఏ లోపమూ రానివ్వడం లేదు . 

అష్ట దిక్పాలకులు  కూడా అదే మాటను ఏక కంఠం తో చెప్పారు . 

ముక్కోటి దేవతలు కూడా అదే విషయాన్నీ తెలియజేసారు . 

దేవేంద్రునికి ఇంకా నమ్మకం కుదరడం లేదు , ఎక్కడో ఏదో జరుగుతోంది . ఇటు చూస్తేనేమో యంత్రాంగం మొత్తం మేము మా పనులు మేము చేస్తున్నాము అంటున్నారు , అటు చూస్తేనేమో ఇటు స్వర్గానికి , అటు నరకానికి వచ్చే జీవుల సంఖ్య విపరీతం గా తగ్గిపోయింది .  ఎటుచూసినా ఖ