అటవీ అమరవీరులు సదా స్మరణీయులు


నగరవనంలో రాష్ట్ర అటవీ ఆమరవీరుల సంస్మరణదినం

శ్రద్ధాంజలి ఘటించిన సిసిఎఫ్ శ్రీ శరవణన్, ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ జె ఎస్ ఎన్ మూర్తి

అటవీ సంపద పరిరక్షణ

కు అంకితభావంతో కృషి చేసి, విధినిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరులు సదా సంస్మరణీయులని ముఖ్య అటవీ సంరక్షణాధికారి ఎస్. శ్రీ శరవణన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గోదావరి మహాపుష్కర నగరవనంలోని అమరవీరుల స్థూపం వద్ద సిసిఎఫ్ శరవణన్, ఎపి స్టేట్ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ జె ఎస్ ఎన్ మూర్తి, వైల్డ్ లైఫ్ డి ఎఫ్ ఓ సి సెల్వం, కాకినాడ డి ఎఫ్ ఓ ఐకేవి రాజు తో పాటు సర్కిల్ పరిధిలోని డి ఎఫ్ ఓ లు, ఇతర అధికారులు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా శ్రీ శరవణన్ మాట్లాడుతూ 1991 లో ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ చే చంపబడిన ఐ ఎఫ్ ఎస్ అధికారి "కీర్తిచక్ర" పందిళ్లపల్లి శ్రీనివాస్ సంస్మరణార్థం రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని పాటిస్తున్నామన్నారు. పందిళ్లపల్లి రాజమండ్రికి చెందినవారని, ఆయన అసమాన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని అన్నారు. అటవీ సంపదను, వన్యప్రాణుల్ని కాపాడడం కోసం తమప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన 82 మంది అటవీ అధికారుల అత్యున్నత త్యాగం మాటలకందనిదని ఆయన పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాన్ని, విధినిర్వహణలో వారందించిన స్ఫూర్తిని ప్రతి ఉద్యోగి గుర్తుంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అటవీశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది అమరవీరులకు గౌరవవందనం అర్పించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం