ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమం


ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కరోనా సోకడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో 40 రోజులుగా ఆయనకు వైద్యులు చికిత్సనందిస్తున్నారు. అయితే.. ఇటీవల కరోనా నుంచి ఆయన కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే.. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలు తిరగబెట్టినట్టు తెలిసింది. ఈ నెల 19 నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు ఎలాంటి హెల్త్ బులెటెన్ విడుదల చేయకపోవడం గమనార్హం. మరికాసేపట్లో ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో మళ్లీ ఆందోళన నెలకొంది.


ముఖ్యాంశాలు