కరోనా మృతుల సంఖ్య 3200


అమెరికాలో కరోనా మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. వీరంతా వాషింగ్టన్‌ రాష్ట్రానికిచ చెందినవారే. బాధితుల సంఖ్య 100దాటినట్లు అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. చైనాలో కొత్తగా వైరస్ బారిన పడ్డవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. మంగళవారం 115 మందికి కొవిడ్ సోకినట్లు గుర్తించారు. మరో 38 మంది మృత్యువాతపడడంతో మృతుల సంఖ్య 2,981కి చేరింది. దక్షిణ కొరియాలో 142 మంది కొత్తవారికి వైరస్ సోకిందని ధ్రువీకరించారు. దీంతో బాధితుల సంఖ్య 5,528కి చేరింది. మంగళవారం నలుగురు మరణించడంతో మృతుల సంఖ్య 32కు చేరింది. వివిధ దేశాల్లో కొవిడ్ మృతులు, బాధితుల సంఖ్య వివరాలివి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం