పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు
పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటడంతో ఆందోళన చెందుతున్న సామాన్యులకు దీపావళి పర్వదినం సందర్భంగా కేంద్రం తీపి కబురు చెప్పింది. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ధరల్ని కాస్త తగ్గించింది. దేశీయ అవసరాల్లో 86 శాతం చమురు లభ్యత దిగుమతి పైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో పరిస్థితి నానాటికీ జటిలంగా మారుతోంది. ఇంధన ధరల నియంత్రణ ప్రభుత్వాల చేతుల్లో లేదని, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్-సప్లయ్‌కి అనుగుణంగా ధరలు మారుతున్న విషయం తెలిసిందే.
