అదుపు తప్పిన కారు.. ఐదుగురిని బలిగొంది


కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన కొద్దిసేపటికే పెనువిషాదం సంభవించింది వైఎస్సార్‌జిల్లా పెండ్లిమర్రి మండలం ఇందిరానగర్‌లో! కేక్‌ కటింగ్‌ అనంతరం రోడ్డు పక్కనే చలిమంట వేసుకున్నవారిపైకి తాగుబోతులు నడిపిన మృత్యుశకటం దూసుకొచ్చింది. చిన్నాపెద్ద అంతాకలిపి ఐదుగురు మరణించారు. కడప-పులివెందుల ప్రధాన రహదారిపై ఉన్న ఈ గ్రామంలో సోమవారం తెల్లారుజామున జరిగిందీ దుర్ఘటన. ఇందిరానగర్‌లో యువకులు ఆదివారం అర్ధరాత్రి తర్వాత కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొన్నారు. ప్రధాన రహదారి పక్కనే చలిమంట వేసుకుని ముచ్చట్లలో మునిగిపోయారు. అంతలో ఓ కారు అదుపుతప్పి వారి పైనుంచి దూసుకొచ్చింది. భాస్కర్ (28), గిరి (14), కార్తీక్ (12), లక్ష్మీ నరసింహ (10)లు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కారు డ్రైవర్ బ్రహ్మానందరెడ్డి (24) కూడా మరణించాడు. అతిగా మద్యం తాగి కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం