ముస్లిం మహిళల మనసు గెలిచిన మోదీ సర్కార్


నరేంద్ర మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లుతో ముస్లిం మహిళల మనసు గెలిచింది. అనుక్షణం అభద్రతతో భయం భయంగా జీవిస్తున్న వారికి ఎందరికో ఆశాకిరణంగా ఈ బిల్లును సర్కారు ప్రవేశపెట్టింది. ఈ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడం చారిత్రాత్మక పరిణామం. ఇది ముస్లిం మహిళల స్థితిగతుల్ని మార్చడమే కాకుండా వారిలో నవ చైతన్యాన్ని తీసుకొచ్చింది. బహిరంగంగా రోడ్లమీదికి వచ్చి జనజీవన స్రవంతిలో భాగం అయ్యేలా వారికి కొత్త దారిని చూపింది. అంతే కాకుండా దేశంలో ఇది సరికొత్త ఓటుబ్యాంక్ ను తయారు చేసిన పరిణామంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముస్లిం మహిళల జీవన భద్రతకు దేశ చరిత్రలోనే తొలిసారి లభించిన గొప్ప ప్రభుత్వ ఆసరాగా ఈ బిల్లు చరిత్రలో నిలిచిపోతుంది. ఇదిలా ఉండగా ట్రిపుల్‌ తలాక్‌ కేసులో ఒక పిటిషనర్‌ అయిన ఇష్రత్‌ జహాన్‌ తాజాగా ఆదివారం హౌరాలోని బీజేపీ కార్యాలయంలో లాంఛనంగా బీజేపీలో చేరారని బీజేపీ బెంగాల్‌ జనరల్‌ సెక్రటరీ సాయంతన్‌ బసు మీడియాకు తెలిపారు. ఆమెను సత్కరించేందుకు త్వరలో రాష్ట్రస్థాయి లో ఓ సభ నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. ట్రిపుల్‌ తలాక్‌ వ్యతిరేకంగా పోరాడిన ఐదుగురు పిటిషనర్లలో ఇష్రత్‌ ఒకరు. దుబాయ్‌ నుంచి ఆమె భర్త ఫోన్‌లో మూడుసార్లు ’తలాక్‌’ చెప్పి విడాకులు ఇచ్చాడు. దీనికి వ్యతిరేకంగా ఆమె న్యాయపోరాటం చేశారు. గత ఏడాది ఆగస్టు 22న సుప్రీంకోర్టు ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమంటూ తేల్చిన నేపథ్యంలో ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్‌ తలాక్‌కు వ్యతిరేకంగా బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లుకు లోక్ సభ తాజాగా ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా ట్రిపుల్ తలాక్ బిల్లు పై దేశవ్యాప్తంగా ముస్లిం మహిళల్లో ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ బిల్లు చట్టం అయితే తమ జీవితాలకు భద్రత ఏర్పడుతుందని వారు విశ్వసిస్తున్నారు. బిల్లు లోక్ సభలో ఆమోదం పొందగానే దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలు సంబరాలు చేసుకున్నారు. అంతే కాకుండా బిల్లుకి వ్యతిరేకంగా లోక్ సభలో మాట్లాడిన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కి వ్యతిరేకంగా ముస్లిం మహిళలు ఆందోళనలు కూడా చేసి అతడి దిష్టి బొమ్మలను తగులబెట్టడం విశేషం. చేరడంపై ఇష్రత్‌ మీడియాతో ఇంకా స్పందించలేదు.

ముఖ్యాంశాలు