పార్లమెంట్ కాంటీన్ లో సబ్సిడీలకు చెల్లు!


ఎంపీలకు నూతన సంవత్సరం కానుక అదిరింది.. పార్లమెంట్ కాంటీన్ లో ఆహార పదార్థాలు సబ్సిడీలు ఎత్తేస్తూ.. జనవరి 1 నుంచి నో లాస్, నో ప్రాఫిట్ పద్ధతిపై కాంటీన్ నడుస్తుందని స్పీకర్ ఆదేశాలు జారీ చేసారు. పార్లమెంటరీ ఫుడ్ కమిటీ సిఫారసు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో 18 రూపాయలున్న శాకాహార భోజనం ఇప్పుడు 30 రూపాయలైంది. 33 రూపాయలకు లోగడ విక్రయించిన మాంసాహార భోజనం 60 రూపాయలకు పెరిగింది. మరో రకం ప్రత్యేక భోజనం విలువ 61 నుంచి 90 రూపాయలైంది. ఇక కోడి కూర ధర 29 నుంచి 40 రూపాయలకు పెరిగింది.

ముఖ్యాంశాలు