సర్జికల్ స్ట్రయిక్స్ పై ఇది మోదీ మాట


ఆపరేషన్ విజయవంతమైనా, విఫలమైనా సూర్యోదయానికి ముందే వెనక్కి రావాలి'. ఇండియన్ ఆర్మీ ప్రత్యేక కమెండోలకు 2016 సెప్టెంబర్ 28న ఎల్ఓసీ వెంబడి పాక్ ఉగ్ర స్థావరాలపై సర్జికల్ దాడుల సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చిన సందేశమిది. ఏఎన్ఐ వార్తా సంస్థకు మంగళవారంనాడు ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారి సర్జికల్ దాడులపై మోదీ పెదవి విప్పారు. భద్రతా దళాల భద్రతను దృష్టిలో ఉంచుకుని సర్జికల్ దాడుల తేదీల్లో రెండుసార్లు మార్పులు చేసినట్టు చెప్పారు. ఉరిలో చోటుచేసుకున్న ఉగ్రదాడుల్లో సైనికులు సజీవసమాధి కావడంతో సైన్యంలో ఉద్వేగం పెల్లుబుకిందని, తాను సైతం ఉగ్వేగానికి గురయ్యానని అన్నారు. ఆ నేపథ్యంలోనే సర్జికల్ దాడుల వ్యూహం రూపొందిందని చెప్పారు.

'విజయం సాధించినా, వైఫల్యమే ఎదురైనా పట్టించుకోను. సూర్యోదయానికి ముందే వెనక్కి వచ్చేయాలి అని సైన్యానికి స్పష్టమైన ఆదేశాలిచ్చాను' అని మోదీ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో మన సైనికులెవరూ మరణించకూడదనే స్థిరనిశ్చయం కారణంగానే తాను ఆపరేషన్ విఫలమైనా గడువు మాత్రం పొడిగించకుండా ముగించుకుని రావాలని కోరడం జరిగిందన్నారు. 'సర్జికల్ స్ట్రైక్స్ అనే ఆపరేషన్ చాలా రిస్క్‌తో కూడిందని నాకు తెలుసు. రాజకీయ రిస్క్ గురించి నేనెప్పుడూ పట్టించుకోను. అయితే సర్జికల్ దాడుల విషయంలో మాత్రం ఆపరేషన్ సక్సెస్, వైఫల్యాలతో సంబంధం లేకుండా సైనికుల భద్రత విషయానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను' అని మోదీ తెలిపారు.

ఉద్విగ్న ఘట్టం...

'ఆ రోజు ఉదయం ఒక గంటపాటు సమాచారం ఆగిపోయింది. దాంతో నాలో ఆతృత పెరిగిపోతూ వచ్చింది. సూర్యోదయమైన గంట తర్వాత కూడా నా పరిస్థితిలో మార్పు రాలేదు. రెండు నుంచి మూడు యూనిట్లు సురక్షిత జోన్‌లోకి వచ్చినా ఆపరేషన్‌లో పాల్గొన్న అందరూ అప్పటికి ఇంకా వెనక్కి రాలేదు. ఆపరేషన్ పూర్తయి అంతా సురక్షితంగా వెనక్కి వచ్చేంతవరకూ నేను ఊపిరిపీల్చుకునేది లేదని చెప్పా' అంటూ మోదీ అప్పటి ఉద్విగ్న

పరిస్థితిని వివరించారు. (Courtesy : Mission Modi 2019 Page)

ముఖ్యాంశాలు