సర్వమత ద్రోహులు.. నైతిక విధ్వంసకులు


ఏ మతానికి నిజమైన శత్రువు అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి! అసలు దైవశక్తిని నమ్మని వాడికి పాపభీతి ఏముంటుంది? లోకంలో నూటికి తొంభై తొమ్మిది మంది ఏదో ఒక అతీత, ఆధ్యాత్మిక శక్తిని నమ్మి.. పాప పుణ్య చింతనతో.. ఎవరి పరిధి లో వారు ఎంతో కొంత నియమబద్ధంగా జీవిస్తుంటే... వాళ్ళందరూ ఈ అతితెలివి వెధవాయిలకి వెర్రాళ్ళలా కనిపిస్తున్నారా? ఊరందరిదీ ఒకదారి.. ఉలిపికట్టెది ఇంకోదారి అన్నట్టు అసలు అలాంటి ఏ లెక్కా లేని వాళ్లకి భూమిపై ఏ హక్కూ లేదని, ఉండరాదని నా అభిప్రాయం. ఎందుకంటే లోకంలో ఒక నీతి, నియతి ఉంది. కనీసం ఏదో ఒక మతం తాలూకు ధర్మాన్ని (అంటే నైతికమార్గాన్ని) అవలంబించిన వారికి ఒక బాధ్యత ఉంటుంది. సాక్షాత్తు సైంటిస్టులే దైవం ఉనికిని విశ్వసిస్తే... ఆ సైంటిస్టుల ఆవిష్కరణల్ని ముక్కున పట్టి అప్పజెప్పే బడుద్ధాయి మేధావులు మాత్రం దైవం లేదనడం.. సైన్సే సర్వం అనడం నిజమైన నాన్సెన్స్! ధర్మం లేదు.. దైవం లేదు..అప్పుడిక నీతి.. జాతి కూడా ఉండవు. ఏ నైతికతా లేని విశృంఖల జీవితానికి మొదటి మెట్టే నాస్తికత అనేది నా నిశ్చితాభిప్రాయం! మహా విశ్వంలో మన ఉనికి ఒక పిపీలకం.. మహా కాలగతిలో మనం చరించేది త్రుటి మాత్రం...! అలాంటి మనం అసలు ఈ సర్వ విశ్వగతికే ఆధారభూతమైన అతీతమైన శక్తి ఉనికిని ప్రశ్నించడమా? కుక్కకి, నక్కకి, క్రిములకి, కీటకాలకు దేని లోకం దానికి ఉంటుంది.. అవి అంతవరకే చూడగలవు.. కాకపోతే వాటిలో గొప్పతనం ఏమంటే.. అవి చూడని ప్రపంచాన్ని.. సత్యాలను కాదని అవి గోల చేయవు. కనీసం సహించి మౌనంగా కలిసి జీవిస్తాయి! కానీ హేతువాదం.. నాస్తికత్వం.. గుడ్డు.. గందరగోళం అంటూ వక్రమేధావులు మాత్రం నైతిక జనజీవితాన్ని కలుషితం చేసే ప్రయత్నాలు నిర్విరామంగా చేస్తున్నారు! వీళ్ళు వాడుకునే భూమి పుట్టుక గురించి పూర్తిగా తెలియదు.. తినే తిండి ఎలా వస్తుందో అనే అసలు రహస్యం ఇప్పటికీ వెల్లడి కాలేదు.. గట్టిగా రెండొందల ఏళ్ళకి ముందు నీ సైన్సు ఎక్కడుంది అని అడిగితే నమలాల్సింది నీళ్ళే! కానీ వీళ్ళు వేలాది ఏళ్లనాటి ధార్మిక, నైతిక విషయాల్ని కూడా కడిగేసే దుస్సాహసం చేస్తారు! లక్షల ఏళ్లనాటి విశ్వ సిద్ధాంతాలు, సైన్సు తత్వాలు బోధించేస్తారు. సనాతన ధర్మం పరమత సహనాన్ని బోధించింది... ఆ ధర్మాన్ని మన దేశం చక్కగా అనుసరిస్తున్నది! అయితే ఏదో ఒక ధర్మం, మతం అవలంబించి ఏదో ఒక నియమానికి కట్టుబడే వారి పట్ల మాత్రమే పరమత సహనం పాటించాలి. అన్ని మత విశ్వాసాలను కాదని.. అందరి నమ్మకాలను ధిక్కరించే వాడు ఈ సహనానికి అర్హుడు కాదు. ధర్మానికి తూట్లు పొడిచే దుష్ట ప్రయత్నాలు చేసేవారి పట్ల సహనం గా ఉండాలని ఏ ధర్మమూ చెప్పలేదు! ప్రత్యర్థికి, శత్రువుకి అయినా ఒక విలువ ఉంటుంది తప్ప ద్రోహులకి, ఇంటిదొంగలకి ఉండదు! వాళ్ళను అన్ని మతాలూ ద్రోహుల్లాగే చూడాలి!

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం