రైల్వే బడ్జెట్లో ఇదీ తెలుగువారి వాటా !


రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ప్రకటించిన కొత్తలైన్లు, ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టులకు చేసిన నిధుల కేటాయింపులు ఇలా ఉన్నాయి. కోటిపల్లి-నర్సాపూర్‌ కొత్త రైల్వేలైన్‌ ప్రాజెక్టుకు రూ. 430 కోట్లు, విజయనగరం-స్తంభాల పూర్‌ మూడో రైల్వేలైన్‌కు రూ. 90 కోట్లు, నడికుడి-కాళహస్తి కొత్త రైల్వే లైన్‌కు రూ. 340 కోట్లు, కాజీపేట-విజయవాడ మూడో రైల్వేలైన్‌కు రూ. 100 కోట్లు, నల్లపాడు-గుంతకల్‌ లైను విద్యుదీకరణకు రూ. 150 కోట్లు. విజయవాడ-గుడివాడ, మచిలీ పట్నం-భీమవరం, నర్సాపూర్‌-నిడదవోలు రైల్వేలైన్ల డబ్లింగ్‌ పనులకు రూ. 122 కోట్లు కేటాయించారు. విజయనగరం-రాయగడ-రాయపూర్‌ లైన్ విద్యుదీకరణకు రూ. 120 కోట్లు విజయవాడ- గూడూరు మూడోలైన్‌కు రూ. 100 కోట్లు, ఓబులవారి పల్లె-కృష్ణపట్నం కొత్త రైల్వేలైన్‌కు రూ. 100 కోట్లు, గుంతకల్‌-బళ్లారి హోస్పేట్‌ విద్యుదీకరణకు రూ. 70 కోట్లు, కడప-బెంగళూరు రైల్వేలైన్‌ ప్రాజెక్టుకు రూ. 240 కోట్లు, కాకినాడ-పిఠాపురం కొత్త రైల్వేలైన్‌కు రూ. 150 కోట్లు, మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ కొత్త రైల్వేలైన్‌కు రూ. 300 కోట్లు, మనోహరాబాద్‌ (మేడ్చల్‌)-కొత్తపల్లి (కరీంనగర్‌) లైన్‌కు రూ. 350 కోట్లు. అక్కన్నపేట-మెదక్‌ మధ్య 17 కిలోమీటర్ల రైల్వేలైన్‌కు రూ. 196 కోట్లు, భద్రాచలం నుంచి సత్తుపల్లి కొత్త రైల్వేలైన్‌కు రూ. 300 కోట్లు, కాజీపేట-బళ్ళారీ మూడోలైన్‌కు రూ. 160 కోట్లు, సికింద్రాబాద్‌ నుంచి, మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ పనులకు రూ. 50 కోట్లు, హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ రెండోఫేజ్‌కు రూ. 100 కోట్లు. చర్లపల్లి స్టేషన్‌లో శాటిలైట్‌ టర్మినల్‌ కి రూ. 5 కోట్లు కేటాయించారు. ఇంకా తెలంగాణలో ఏ-1 స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us