అలాస్కాలో భూకంపం


అమెరికా అలాస్కాలో అతి భారీభూకంపం సంభంవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైంది. దీని ప్రభావంతో గృహాల్లోని వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అలాస్కా తీరప్రాం తంలో అమెరికా ప్రభుత్వం సునామీ హెచ్చరికలను జారీచేసింది. అమెరికా జియోలజికల్ సర్వే అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ భూకంపం ఉత్తర యాంకరేజి ప్రాంతానికి 11 కిమీ దూరం లో కేంద్రీకృతమైంది. మొదటి ప్రకంపనల తర్వాత వరుసగా పలుమార్లు భూమి పొరల్లో 40.9 కిలోమీటర్ల అడుగుభాగాన ఈ ప్రకంపనలు చోటుచేసుకొన్నాయి. యాంకరేజీ ప్రాంతంలో దాదాపు 3 లక్షలమంది నివసిస్తుండగా మరో లక్షమంది చుట్టుపక్కల ఉన్నారు. ఈ భూకంపం ఉదయం 8.29 గంటలకు చోటుచేసుకొంది. ఇంతవరకు 40 సార్లు భూప్రకంపనలు సంభవించినట్టు అలాస్కా భూకంప కేంద్రం వెల్లడించింది. ఇందులో 10 రిక్టార్ స్కేల్‌పై 4.0గా నమోదుకాగా, 3 సార్లు 7.0గా నమోదయ్యింది. ఇంకా నష్టం వివరాలు అందాల్సి ఉంది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం