శేరిలింగంపల్లి పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా ప్రదీప్


పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఎమ్.ఎల్.ఎ అభ్యర్థిగా గా తెలంగాణ రాష్ట్రం లోని శెరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి "ప్రదీప్ అనిరుధ్" పోటీ చేస్తున్నారు. ధ్యానం చేసి సరైన నాయకులని ఎన్నుకో వడం పై ప్రజలలో అవగాహన కల్పించాలి అనే లక్ష్యంతో, ఉన్నత విలువలున్న వారు రాజకీయాల్లో ఉండాలనే ఆశయంతో 1999 లో ఈ పార్టి ని బ్రహ్మర్షి పత్రిజి స్థాపించారు. సుపరిపాలన కేవలం జ్ఞానోదయం కలిగిన వ్యక్తులతోనే సాధ్యపడుతుందని నమ్మిన ఈ పార్టీ 1999, 2004, 2014 ఎన్నికల్లో వివిధ ప్రాంతాలలో పోటీ చేసింది. పేరు : ప్రదీప్ అనిరుధ్ ముసిపట్ల నియోజకవర్గం - సేరిలింగంపల్లి పార్టీ - పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తల్లిదండ్రులు - సుధాకర్ , జయలక్ష్మి పుట్టింది - హైదరాబాద్, పెరిగింది - వరంగల్ చదువు - కంప్యూటెర్ ఇంజినీరింగ్ ఉద్యోగ అనుభవం - 9 సం. ఇంతవరకు ఎంతోమంది నాయకులు ఉన్నప్పటికీ శేరిలింగంపల్లి నియోజకవర్గం సరైన దిశగా అభివృద్ధి చెందలేదు. ఈ లోటును తీర్చాలని, తనదైన శైలిలో యువతకు చేయూత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రదీప్ పోటీ చేస్తున్నారు. జె .ఎన్. టి.యూ నుండి కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎల్.ఎల్.బి లో గ్రాడ్యుయేషన్ పొందిన ప్రదీప్ 9 సంవత్సరాలపాటు ఇండియా మరియు ఇతర దేశాల్లోని వివిధ సంస్థలలో పనిచేశారు. చిన్నప్పటి నుండి మంచి పుస్తకాలు చదవడంపై ఆయనకి ఎంతో శ్రద్ధ ఉండేది. ధ్యానం పై ఉన్న మక్కువ ఆయనకు ప్రపంచాన్ని సరికొత్తగా, ఆనందంగా పరిచయం చేసింది. సింది. చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం ఉంటె ఎంత పనైనా, ఎలాంటి పనినైనా చేయగలం అని ఆత్మ విశ్వాసంతో నమ్మే ప్రదీప్ ధ్యానం, సెల్ఫ్ హెల్ప్ పై పాఠశాలల్లో, కాలేజీలలో మోటివేషన్ కార్యక్రమాలను అనేకం నిర్వహించారు. శాకా హారం, ధ్యానం తదితర మంచి అలవాట్లకు ప్రచారం కల్పించి, వాటి ఆచరణను పెంచితే ఆదర్శవాద సమాజాన్ని నిర్మించడం సాధ్యమని నమ్మరు ప్రదీప్. మెరుగైన జీవనం ప్రపంచ శాంతి ద్వారా సాధ్యపడుతుందని, అది ధ్యానంతోనే సాధ్యమని అన్నారాయన. యువతను రాజకీయాలలో ప్రోత్సహించడమే తన ముఖ్య ఉద్దేశమన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us