ఎపి ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్ కేలండర్ ఆవిష్కరణ


ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్ 2019 క్యాలెండర్ ను రాజమండ్రి సర్కిల్ అటవీ సంరక్షణాధికారి కార్యాలయం లో మంగళ వారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అటవీ సంరక్షణాధికారి శాంతి ప్రియా పాండే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె సిబ్బందికి, అధికారులకు, అసోసియేషన్ సభ్యులకు నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలిపారు. కాకినాడ డి ఎఫ్ ఓ డాక్టర్ నందని సలారియా, వైల్డ్ లైఫ్ డి ఎఫ్ ఓ అనంత్ శంకర్, అసోసియేషన్ ట్రెజరర్ కే.వి.ఎస్. రాజ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరీష్, ఇంకా సభ్యులు రాధాకృష్ణ, శ్రీనివాస్, రమేష్, పద్మావతి, శైలజ, సుందరం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ట్రెజరర్ రాజకు మార్ మాట్లాడుతూ అసోసియేషన్ క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా జరిగాయన్నారు. గుంటూరులోని ప్రధాన కార్యాలయంలో ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాదికారి (అటవీ దళాధిపతి) మొహమ్మద్ ఇలియాస్ రిజ్వీ కేలండర్ ను ఆవిష్కరించారన్నారు. అసోసియేషన్ విజ్ఞాపనలు పరిశీలించి వెంటనే పరిష్కరిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారన్నారు. అన్ని డివిజన్లు, సర్కిల్స్ పరిధిలో ఈకార్యక్రమాలు జరిగాయని చెప్పారు.

ముఖ్యాంశాలు