శివానంద సుపథ ఫౌండేషన్ స్టాల్ ప్రారంభం


విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌, ఎన్టీఆర్‌ ట్రస్ట్, ఏపీ భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో 30వ పుస్తక మహోత్సవం ప్రారంభమయింది. ఇందులో భాగంగా శివానంద సుపథ ఫౌండేషన్ తన బుక్ స్టాల్ ను 1 వ తేదీన ప్రారంభించింది. ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వల్లూరి విజయ హనుమంతరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు రాధాకుమారి, విఠల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు విజయవాడ స్వరాజ్‌ మైదానంలో ఈ పుస్తక మహోత్సవం జరుగుతుంది. నవ్యాంధ్ర పుస్తక సంబరాల కన్వీనర్‌ ఎమ్మెస్కో విజయ్ కుమార్ తదితరుల సారథ్యంలో పుస్తక మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేసారు. నవ్యాంధ్ర పుస్తక సంబరాలు 2019 పేరుతో వీటిని నిర్వహిస్తున్నారు. జనవరి 4వ తేదీన పుస్తక ప్రియుల నడక కార్యక్రమం జరుగుతుంది.

ముఖ్యాంశాలు