గాంధీజీ అంటే విగ్రహం కాదు


గాంధీజీ అంటే విగ్రహం కాదని విస్తరించిన విలువలు, జీవించి ఉన్న ఆలోచనలు అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాహుల్‌ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా రాహుల్‌ ట్విటర్‌లో గాంధీ ఫొటోతో పాటుగా ట్వీట్‌‌ చేశారు. ‘గాంధీజీ అంటే కదలలేని విగ్రహం కాదు, దేశమంతా విస్తరించి ఉన్న విలువలు, జీవించి ఉన్న ఆలోచనలు. సత్యం, అహింస.. వీటి కోసమే ఆయన జీవించారు, దేశం కోసం చనిపోయారు. నిజమైన దేశ భక్తులు ఆయన విలువలను కాపాడాలి’ అని అందులో పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు