ఆన్ లైన్ సర్వేలో ప్రధాని మోదీకి మొగ్గు


నరేంద్ర మోదీనే మళ్లీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఓ ఆన్‌లైన్‌ సర్వే వెల్లడించింది. రెండోసారి ఆయనకు ప్రధాని అయ్యే అవకాశం ఇస్తే భవిష్యత్తు బాగుంటుందని సర్వేలో పాల్గొన్న వారిలో 63శాతం అభిప్రాయపడ్డారని తెలిపింది. ఈ ఆన్‌లైన్‌ సర్వేను న్యూస్‌ పోర్టల్‌ డైలీ హంట్‌, డేటా అనలిటిక్స్‌ కంపెనీ నీల్సన్‌ ఇండియా నిర్వహించాయి. సర్వేలో భాగంగా ఆన్‌లైన్‌లో 54లక్షల మంది అభిప్రాయాలు సేకరించారు. 2014 ఎన్నికల సమయంలో మోదీపై ఎంత నమ్మకం ఉందో ఇప్పుడు కూడా అంతే నమ్మకముందని 63శాతం మంది అభిప్రాయపడినట్లు సర్వే తెలిపింది.

ముఖ్యాంశాలు