హిందూ ధర్మంపై సరికొత్త దాడి!

"దేవుడిని వెదుకుతూ పూజలు చేస్తాం... కానీ దానము చేస్తే దేవుడే నిన్ను వెదుక్కుంటూ వస్తాడు..." ఇలాంటి వాట్సాప్ మెసేజులు చాలా వస్తున్నాయి... భేష్.. ఇది వినడానికి ఎంత గొప్పగా ఉంది! నిజమే కదా అని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ ఇది ప్రబలంగా హిందూ వ్యతిరేకం. సామాజిక మాధ్యమాల్లో ఈ తరహా ప్రచారం నిత్యం జరుగుతూనే ఉంది. ఇవి హిందూ ధర్మంలో ఉన్న పూజ అనే కాన్సెప్ట్ కి వ్యతిరేకంగా మిషనరీలు (సేవ, దానం పేరుతో మత ప్రచారం చేసే సంస్థలు) లేదా నాస్తికులు తయారు చేసి ప్రచారం చేస్తున్న సందేశాలని నా స్థిరాభిప్రాయం. 
ఈ సూక్తిలో ఉన్న నీతి దానం చేయమని చెప్పడం.. దానిలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు... అది మంచి పని.. పుణ్యం కూడా! కానీ పూజతో దానిని పోల్చి చెప్పడంలో మతలబు ఉంది. హిందూ ధర్మంలో నైతిక విలువలు, దైవారాధన, దానం, పుణ్యం, సేవ ఇవన్నీ కలిసే ఉంటాయి. హిందూ ధర్మంలో దానం చేయడమూ పూజ కిందే లెక్క. పూజలోనూ దానం ఇమిడి ఉంటుంది. వీటిని విడదీయడం ఎవరి తరమూ కాదు. కానీ ఈ తరహా మెసేజులు ఇచ్చే వ్యక్తులు అభ్యుదయం ముసుగులో... పూజను వీటినుంచి విడదీయాలని పథకం ప్రకారం ప్రయత్నిస్తున్నారు. ఇది ఈ ఒక్క మెసేజులు రూపంలోనే కాదు.. ఈ మధ్య సినిమాల్లో కూడా తరచూ ఇదే ప్రయత్నం జరుగుతున్నది. అభిషేకానికి పొసే పాలు వృథా అని.. వాటిని అడుక్కునే వాళ్ళకి పోయడం అత్యుత్తమ మానవత్వం అని ఇటీవల చాలా సినిమాల్లో విన్నాము. ఇలాంటి వాదనలు చేయడం ఈమధ్య చాలామందికి ఫేషన్ గా మారింది. విలువైన ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకం ఎందుకు చేయాలి.. చేస్తే ప్రయోజనం ఏమిటి.. ఇత్యాది విషయాలను ప్రయోగాత్మకంగా చూపించి వీళ్ళ నోరు మూయించలేరు కాబట్టి ఈ తరహా వ్యక్తుల వాదనలు నిరంతరాయంగా సాగుతున్నాయి. అంతిమంగా ఇవి మత మార్పిడులకు దోహదం చేస్తున్నాయి. ఓ కుటుంబం వేలాది రూపాయలు ఖర్చు చేసి పుణ్య క్షేత్రాలకు యాత్రకు వెళ్లడం వీరికి అవివేకంగా కనిపిస్తుంది.. ఆ డబ్బుతో పదిమందికి రెండు రోజులు భోజనం పెట్టొచ్చుగా అంటారు! కానీ ఆయా ఆలయాలు, వివిధ ధార్మిక సంస్థలు కేవలం భక్తుల విరాళాలతో ఏటా వేలాది కోట్ల రూపాయలతో చేస్తున్న అన్నదానాలు, విద్యా, వైద్య సేవలు హిందూ వ్యతిరేకత కమ్మేసిన వీరి దోష నేత్రాలకు  కనిపించడంలేదు. హిందువులు కేవలం మత పరమైన ధార్మిక కార్యక్రమాలపై పెట్టే ఖర్చులు భారత దేశపు బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంటాయనే విషయం తెలిస్తే మనకి ఆశ్చర్యం కలుగక మానదు. పండగలు, కొత్త బట్టలు, పిండివంటలు, తీర్థయాత్రలు, దానధర్మాలు, వ్రతాలూ, దీక్షలు, యజ్ఞ యాగాలు, హోమాది శాంతులు, నవరాత్రులు, అన్నదానాలు, జాతరలు ఇలాంటివన్నీ వీటిలో వస్తాయి. అతిథిని, అభ్యాగతుని, యాచకుని ఎవరినైనా సరే నారాయణాంశగానే భావించే ధర్మం ఇది. ఇక్కడ దానం చేసేది ఎదుటివారిని ఉద్దరించడానికి కాదు.. తాను ఉద్ధరింపబడడానికి అనే భావిస్తారు.. అదే వేదం చెప్పింది. అందుకే మాధవార్పితంగానే ఇక్కడ మానవసేవే చేస్తారు... చేయాలి. దైవ చింతన.. ఆధ్యాత్మిక కోణం లేని దానం దానమే కాదు... ఎందుకంటే అందులో అహంకారం, కర్తను అనే భావన ఉంటాయి. అవి ఉన్నచోట భగవానుడు ఉండడు! మత ప్రచారం అనే సంకుచిత స్వార్థంతో భోగదేశాల సంపన్నులు చేస్తున్న వ్యాపారంగా నేటి మిషనరీ సంస్థల సేవను చెప్పవచ్చు. కానీ భారతీయత నిండిన సేవ అది కాదు... అది జీవన విధానంలో సమ్మిళితమై పోయిన ధార్మిక ప్రక్రియ. హిందువులకు సేవ, దానం గురించి ప్రపంచంలో ఎవరూ చెప్పనక్కరలేదు.. వారికీ ఆ అర్హత లేదు. ప్రపంచానికే జగద్గురువైన భారతదేశం ఏనాడో వారికి జ్ఞానదానం చేసింది.. ఇప్పటికీ చేస్తూనే ఉంది.  ఒక దేవాలయానికి జనం వందలు వేలుగా వెళ్లడం కుహనా అభ్యుదయ వాదులకి, కుహనా లౌ