తప్పులుంటే మన్నించండి - రజనీకాంత్

తెలిసి ఏ తప్పూ చేయలేదని... తెలియక ఎప్పుడైనా తప్పు చేసి ఉంటే క్షమించమని రాజకీయాల్లోకి అడుగిడిన సూపర్ స్టార్ రజనీకాంత్ మీడియాను కోరారు. ఆయన చెన్నైలోని ఎగ్మోర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తన రాజకీయ ప్రవేశం గురించి ప్రపంచం అంతా తెలిసేలా కథనాలు రాసిన మీడియాకు ధన్యవాదాలు చెప్పారు. తన తొలి ఉద్యోగం కర్ణాటకలోని ఒక పత్రికలో ప్రూఫ్‌రీడర్ అని, దాదాపు రెండు నెలలు ఆ ఉద్యోగం చేశానని రజనీ గుర్తు చేసుకున్నారు. ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన తొలి ఇంటర్వ్యూను కూడా ప్రస్తావించారు. తాను పదవి, డబ్బు ఆశించి రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి వెబ్ సైట్ ని ప్రారంభించినట్లు తెలిపారు.