సౌదీ తొలి చిత్రం రజనీ 2.ఓ


సౌదీ అరేబియాలో రజనీకాంత్ ‘2.ఓ’. సినిమా..! ఇదేమిటి అని ఆశ్చర్యపోవద్దు.. నిజమే! ఈ ఏడాది నుంచి సౌదీ అరేబియాలో సినిమా థియేటర్లను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ థియేటర్లు ఏర్పాటు చేశాక విడుదల య్యే తొలి సినిమా మనదే. అదే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘2.ఓ’. ఈ సినిమా ఏప్రిల్‌ 14న విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో కలిపి దాదాపు 15 భాషల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 1980లలో సౌదీలో పెద్ద ఎత్తున ఇస్లామిక్‌ పునరుద్ధరణ ఉద్యమం జరిగింది. ఈ సందర్భంగా సినిమాలు మత సిద్ధాంతాలకు విరుద్ధం అంటూ అక్కడ అన్ని థియేటర్లను మూసివేశారు. ప్రస్తుతం ఆ దేశంలో ఒకే ఒక్క సినిమా హాల్‌ ఉంది. అది ఖోబార్‌లోని ఐమాక్స్‌ థియేటర్‌. అందులోనూ అన్ని సినిమాలూ ఉండవు. కేవలం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డాక్యుమెంటరీల ప్రదర్శనే జరుగుతుంది. 35 ఏళ్ల తర్వాత అక్కడ థియేటర్లను తిరిగి ప్రారంభించాలని సౌదీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది మార్చిలో తొలి సినిమా థియేటర్‌ను ప్రారంభించవచ్చని సౌదీ మంత్రి ఒకరు తెలిపారు.

ముఖ్యాంశాలు