దేవుడి ఆదాయం పైనే మక్కువ - స్వరూపానంద


దేవాలయ వ్యవస్థను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి, వాటి ద్వారా స్వలాభం కోసం చూస్తున్నారని, హిందూ దేవాలయ ఆదాయాల మీద తప్ప ప్రభుత్వానికి దేవుడి మీద మక్కువ లేదని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ధ్వజమెత్తారు. విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజల వ్యవహారమే ఇందుకు నిదర్శనమని అయన మండిపడ్డారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పీఠం తరపున లేఖ రాస్తామని చెప్పారు. త్వరలో పీఠాధిపతుల సమావేశం ఏర్పాటుచేసి దేవాలయాల విషయంలో ప్రభుత్వ అనుచిత ధోరణిపై కోర్టులో కేసు వేస్తామన్నారు. విజయవాడ దుర్గగుడిలో రెండేళ్లుగా అనేక అపచారాలు, అపరాధాలు జరుగుతున్నాయని.. ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి దేశానికి అరిష్టమన్నారు. భక్తుల మనోభావాలకు భంగం కలిగించే రీతిలో ఆలయంలో క్షుద్ర, తాంత్రిక పూజలు చేయడం శోచనీయమన్నారు. ఈ ఆరోపణలపై నిజ నిర్ధారణకు దేవాదాయ శాఖ ఇప్పటికీ ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. దుర్గ గుడి ఈవోపై పలు ఆరోపణలు ఉన్నా ఎందుకు ఆమెపై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దేవాదాయం దారి మళ్లుతున్నదని, దుర్వినియోగం అవుతోందని స్వామీజీ ఆరోపించారు. తాంత్రిక పూజల వ్యవహారంలో ప్రభుత్వం అధికారులను వదిలి అర్చకులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం