ఆలయ వ్యవస్థ బలోపేతం.. పురోగతికి ఊతం

ఉపాధి ఉద్యోగాల కల్పనకు సంబంధించి ప్రతి రాష్ట్రం కూడా తలపట్టుకు కూర్చుంటున్నాయని అనుకోవడం అతిశయోక్తి కాదేమో. భారతీయ వ్యవసాయం మరియు వ్యవసాయ ఆధారిత రంగాలను సంపూర్ణంగా నాశనం చేసిన అంగ్లేయులు కడు పేదరికాన్ని సృష్టించి వెళ్ళిన తరువాత కూడా ప్రస్తుత ప్రభుత్వాలు ఉపాధి ఉద్యోగావకాశాల దిశగా చేసిన ప్రయత్నాలు చాలా తక్కువేనని చెప్పవచ్చు. ఉపాధి అవకాశాలను సృష్టించడానికి బదులుగా ఉచితాలను ప్రకటిస్తూ అవి ప్రజలను సాకే ప్రయత్నాలను చేసాయి. రైతులకు సబ్సిడీలు, బీపీయెల్ కార్డులు, ఉచితంగా బియ్యం, పాఠశాలకు రావడానికి ప్రోత్సాహక ధనం, నిరుద్యోగ భృతి ఇలా అవకాశం దొరికిన చోటల్లా డబ్బు పంచడం చేసి ప్రజలను మరింత సోమరులుగా మార్చి దారిద్ర్యానికి అనుకూలంగా తయారు చేసేస్తున్నారు. నిజమైన అర్హులకు, అశక్తులకు, పేదవారికి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలను వర్తింప చేయడం వరకూ సబబే కాని, అందరినీ ఒకే గాటన కట్టే ప్రయత్నాలు మంచివి కాదు. ప్రాచీన భారతంలో రాచరిక వ్యవస్థ కూడా ఉచితాను ఇచ్చింది. అయితే ఉచితాలను గుళ్ళూ గోపురాల ద్వారా తన వంతుగా ఇంతా అని ఇచ్చి మిగతాది గుడి మాన్యం ద్వారా ఆపైన ఊరి ప్రముఖుల ద్వారా, దాన ధర్మాల రూపేణా సంగ్రహింపజేసి ప్రసాద వ్యవస్థను రూపొందించడం జరిగేది. ఆయా ఊళ్ళ ఆలయ వ్యవస్థ ద్వారా, జరిగే దానం దేవుని ప్రసాదంగా ప్రజలందరూ భావించడం వల్ల అది దురుపయోగమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉండి, అందరిలో ఒకే ఐక్యతా భావం నెలకొనేది. ప్రతి ఊళ్ళో ఉండే ప్రతి కులదేవతకూ ఈ రకమైన వ్యవస్థ తప్పని సరిగా ఉండేది. ఇప్పుడు కుల దేవతల ఆరాధనలు క్రమంగా తగ్గిపోతున్నాయి. (కుల దేవతల ప్రసక్తి, విషయం మరో వ్యాసంలో ముచ్చటిద్దాం)
ఈ ఉచితాల వలన అనేక మంది సోమరులుగానూ పనిదొంగలు గానూ తయారవుతున్నారు. దీనిని అడ్డం పెట్టుకొని దానాలని, ధర్మాలని, ట్రస్టులని, యన్ జీవోలని ఇలా కొంత మంది ముష్టి విదిలిస్తూ తమ ఆదాయానికి ప్రభుత్వాలకు కట్టాల్సిన పన్నులను ఎగవేయడం, దాన్ని ఇంకొంత మంది ఎగవేతదారులు మార్గదర్శకంగా తీసుకోవడం నిజంగా శోచనీయమైన విషయం. ఇంకొంత మంది ఇంకో అడుగు ముందుకు వేసి తమ డబ్బును ఇక్కడే దాస్తే దొరికి పోతామన్న భయంతో వేరే దేశాలలో డబ్బును పోగేసుకోవడం జరుగుతోంది. ఇలా అన్నీ ఉండి కూడా సొంత గడ్డమీదే దొంగల్లా బ్రతుకుతున్నవారు ఎంతమందో. అటువంటి వారు వేరే దారిలేక అసమర్థులైన రాజకీయ నాయకులను ప్రోత్సహిస్తూ తమకు అండదండలుగా ఉండేలా చేసుకొని ఒక అవినీతి వ్యవస్థను నిర్మిస్తున్నారు. తద్వారా దేశ భవితను వారు కాల రాస్తున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు ఈ త్రికోణ అనైతిక సంబంధంతో గడిస్తూ ఉంటే, పని లేని కొందరు సోమరులు దొరికిన దానితో శునకానందం పొందుతూ కాలం గడిపేస్తున్నారు. అదీ దొరకని నాడు వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయి తమలో తామే కుమిలిపోతున్నారు తప్ప వ్యవస్థ వైఫల్యానికి తామూ పాలు బాధ్యులమేనన్న ఇంగితం, విచక్షణ ఏ కోశాన కలగడం లేదు. దీనికి మూల కారణమైన నగరీకరణ పై ఉన్న ఆసక్తి తగ్గించుకొని, తమకు ఉన్న వనురులపై, సంస్కృతీ పరిరక్షణపై అవగాహన పెంచుకొంటే తప్ప స్థానికంగా ఉపాధి ఉ