పాకిస్థాన్ కు అమెరికా అల్టిమేటం


ఉగ్రవాదంపై పోరుకు పాకిస్థాన్‌ 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే పాకిస్థాన్‌పై అమెరికా మరిన్ని చర్యలు తీసుకుంటుందని వైట్‌ హౌస్‌ హెచ్చరించింది. ఇప్పటికే ట్రంప్‌ పాకిస్థాన్‌ ను ఘాటుగా విమర్శించడంతో పాటు, రూ.1700 కోట్ల నిధుల విడుదలను కూడా నిలిపి వేసిన సంగతి తెలిసిందే. తాజాగా వైట్‌హౌస్‌ ప్రతినిధి సారా శాండర్స్‌ మాట్లాడు తూ ‘ఉగ్రవాదాన్ని ఆపే శక్తి పాకిస్థాన్‌కు ఉంది. అయితే ఆ పని పాక్‌ చేయాలి. పాక్‌ నుంచి మేమదే ఆశిస్తున్నాం. మరో 24 నుంచి 48 గంటల్లో పాక్‌పై మేము మరిన్ని చర్యలు తీసుకోబోతున్నాం... అవి ఆగాలంటే పాకిస్థాన్ ఉగ్రవాద నిర్మూలనకు తాను చేయగలిగిన పని చేయాలి ’ అని తెలిపారు. పాకిస్థాన్‌ అమెరికాతో డబుల్‌ గేమ్‌ ఆడుతోంది అని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలి వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే శాండర్స్‌ నుంచి ఈ స్పందన వెలువడింది. మరోపక్క ట్రంప్‌ వ్యాఖ్యలను పాక్‌ నిశితంగా ఖండించింది.

ముఖ్యాంశాలు