గజల్ శ్రీనివాస్ కు సేవ్ టెంపుల్స్ సంస్థ ఉద్వాసన


లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ప్రముఖ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌ను సేవ్‌టెంపుల్స్‌ సంస్థ ప్రచారకర్త బాధ్యతల నుంచి తొలగించింది. గ్లోబల్‌ హిందూ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు వెలగపూడి ప్రకాశ్‌రావు బుధవారం ఈ సంగతి తెలిపారు. ‘సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ సంస్థ ఎన్నారైల సహకారంతో 2006లో ఏర్పాటైంది. సంస్థ సిద్ధంతాల్లో ఇల్లు, సమాజంలో మహిళలకు అత్యున్నత గౌరవం ఉంటుంది. మా కార్యాలయంలో లైంగిక వేధింపులు జరిగిన సమాచారాన్ని మేము దిగ్భ్రాంతి చెందాము. అధికార దుర్వినియోగం, నైతిక విలువలకు విఘాతం సహించం. గజల్‌ శ్రీనివాస్‌ ను తక్షణమే సస్పెండ్‌ చేయాలని మా సంస్థ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఏకగ్రీవంగా తీర్మానించారు అని తెలిపారు. సేవ్‌ టెంపుల్స్‌ సంస్థ మహిళా ఉద్యోగినిని లైంగికంగా వేధించిన కేసులో గజల్‌ శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం విదితమే.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం