వెట్ ల్యాండ్ డే సందర్భంగా కోరంగిలో చిత్రలేఖన పోటీలు


కోరంగి వన్యప్రాణి అభయారణ్యంలో వెట్ ల్యాండ్ డే సందర్భంగా అటవీ శాఖఆధ్వర్యంలో శుక్రవారం పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. తాళ్లరేవు తదితర ప్రాంతాలనుంచి సుమారు 200 మంది హై స్కూల్ విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలుత విద్యార్థులతో ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. మడ అడవులు, వాటిలోని చెట్ల గురించి, ఇక్కడి జంతు, పక్షి సమూహాల గురించి వారికి వివరించారు. అనంతరం చిత్రలేఖన పోటీలు జరపగా దాదాపు వందమంది పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం ఈ పోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేసారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి టి.శ్రీసాయి, సెక్షన్ అధికారులు అశ్వినీకుమార్, శేఖర్ బాబు, స్వచ్చంద సంస్థ ప్రతినిధి మృత్యుంజయరావు, రీసెర్చ్ సైంటిస్ట్ లు బాలాజీ, శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు