"సామాజిక" ప్రజాదరణలో మోదీ ముందంజ


2017 సంవత్సరానికి ఫేస్‌బుక్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పార్లమెంటేరియన్లు ఎవరో తెలుసా.. మొదటి స్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (లోక్‌సభ) నిలిస్తే రెండవ స్థానంలో క్రికెట్‌ దేవుడు సచిన్‌ తెందూల్కర్‌ (రాజ్యసభ) నిలిచారు. రాజకీయ పార్టీల్లో భాజపా ప్రథమస్థానంలో ఉంది. తరవాతి రాంక్ లు ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీలకు తర్వాతి ర్యాంకుల్లో నిలిచాయి. చర్చలు, స్పందనలు, షేర్లు, కామెంట్లు, లైక్‌ల ఆధారంగా ఈ ర్యాంకులను ఫేస్‌బుక్‌ రూపొందించింది. అమిత్‌ షా, ఆర్‌.కె.సిన్హా, అసదుద్దీన్‌ ఒవైసీ, భగవంత్‌మన్‌ తదితరులు కూడా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అత్యున్నత స్థాయి కార్యాలయాలు, ప్రముఖుల్లో పీఎంవో, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌లకు అత్యంత ప్రజాదరణ లభించినట్లు పేస్ బుక్ తెలిపింది. ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) పేజీకి 1.374 కోట్ల ఫాలోవర్లు ఉండగా, 1.382 కోట్ల ‘లైక్‌’లు నమోదయ్యాయి. రాష్ట్రపతి పేజీకి 48.8 లక్షల ఫాలోవర్లు ఉండగా, 49 లక్షల లైక్‌లు వచ్చాయి. రాష్ట్రాల స్థాయిలో యూపీ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్‌, వసుంధర రాజేలు ప్రజాదరణలో ముందున్నారు.

ముఖ్యాంశాలు