జాదవ్ కిడ్నాప్ కి ఆధారాలున్నాయి!


పాకిస్థాన్‌ ప్రపంచానికి చెబుతున్న అసత్యాలు అడ్డుకట్ట పడేలా భారతదేశం పకడ్బందీ ఆధారాలను ప్రవేశపెట్టనుంది. భారత రక్షణ విభాగం ఈ మేరకు చేసిన కృషిలో విజయం సాధించింది. ప్రస్తుతం పాకిస్థాన్ చెరలో ఉన్న రిటైర్డ్ నావీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌ను పాకిస్థాన్‌ అక్రమంగా తమ దేశంలో బంధించిందని అంతర్జాతీయ సమాజానికి తెలియజేసేందుకు పనికొచ్చే కీలకమైన ఆధారాలను భారత్ తాజాగా ప్రకటించింది. జాదవ్‌ను పాక్‌ ఆర్మీకి అత్యంత సన్నిహితంగా ఉండే జైషే ఉల్‌ అదల్‌ అనే ఉగ్రవాద సంస్థ ఇరాన్‌లో కిడ్నాప్‌ చేసి పాక్‌కు అప్పగించిందని ఆరోపించిన భారత్ అందుకు తమ వద్ద ఆధారాలున్నట్లు ప్రకటించింది. జైషే ఉల్‌లో పనిచేసే ముల్లా ఒమర్‌ అనే ఇరానీ సంతతి ఉగ్రవాది చబహార్‌ ఏరియాలో జాదవ్‌ను కిడ్నాప్‌ చేసి పాక్‌ ఆర్మీకి అప్పగించాడు. జైషే ఉల్‌ అదల్‌ అనేది జమాత్‌ ఉద్‌ దవా, లష్కరే ఈ ఖురాసన్‌ అనే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు సాగిస్తూ ఉంటుంది. అంతే కాకుండా పాక్‌ ఆర్మీకి సాయం చేస్తూ ఇరాన్‌, బహ్రెయిన్‌లోని పాక్‌ రాయబార కార్యాలయాల్లో డబ్బు తీసుకుంటుంది. ముఖ్యంగా బలుచీస్థాన్‌ పోరాట వీరులను అణిచివేసేందుకు పాక్‌ ఆర్మీతో కలిసి ఈ ఉగ్రవాద సంస్థ వారు అతి క్రూరంగా అనేకమందిని మట్టుబెట్టారని కూడా భారత్ పేర్కొంది. జాదవ్‌ తమకు ధన్యవాదాలు చెప్పినట్లు పాక్‌ మోసపూరిత వీడియోను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే భారత్‌ ఈ షాకింగ్ ఆధారాలతో ఉన్న సమాచారాన్ని బయటపెట్టింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం