ఆధార్‌ భద్రతపై సందేహాలు అవసరం లేదు

ఆధార్‌ భద్రతపై  ఏ సందేహాలు అవసరం లేదని, ఆధార్ సమాచారం హ్యాకింగ్ అయ్యే అవకాశమే లేదని  కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ సమాచారం పూర్తిగా సురక్షితమని యుఐఎఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) పేర్కొంది. రూ. 500కే  పది నిముషాల్లో కోట్లాది మంది ఆధార్  వివరాలు బహిర్గతం అన్న వార్తలపై స్పందించిన యుఐఎఐ ఇవి పూర్తిగా నిరాధారమైనవని,  పుకార్లు మాత్రమేనని స్పష్టం చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుండి సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఆధార్‌  వ్యవస్థ పూర్తిగా సురక్షితమైందని, దీని గోప్యతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని హామీ ఇచ్చారు. 

Facebook
Twitter