సెల్యూట్ జ్యోతి సురేఖా..!


తెలుగు తేజం, విలువిద్య క్రీడాకారిణి జ్యోతిసురేఖ ఒక గొప్ప నిర్ణయం ద్వారా తన దేశభక్తిని చాటుకుంది. ఆమె ప్రతిభాపాటవాలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం గతంలో అర్జున అవార్డును ప్రదానం చేసింది. ఆ అవార్డు కింద ఇచ్చిన రూ.5లక్షల నగదు బహుమతిని దేశ రక్షణ కోసం శ్రమిస్తున్న సైనికుల సంక్షేమ నిధికి విరాళంగా ఇవ్వాల ని ఆమె నిర్ణయించింది. ఈ మొత్తాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి అందించనున్నట్లు జ్యోతి సురేఖ తెలిపింది. పార్లమెంట్‌ భవనం వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం పాటుపడుతున్న సైనికులకు తనవంతు సాయంగా ఈ విరాళం ఇవ్వాలని భావించానన్నారు.

ముఖ్యాంశాలు