4 వ తేదీ నుంచి స్టేట్ ఫిజియో- ప్రీమియర్ లీగ్


రాజమండ్రి ఫిజియో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో జనవరి 4 ,5 ,6 తేదీలలో స్థానిక విల్ పురంలోని మార్గాని ఎస్టేట్స్ మైదానంలో రాష్ట్ర స్థాయి ఫిజియో ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఫిజియో ప్రీమియర్ లీగ్ నిర్వహించడం రాష్ట్రంలో ఇదే తొలిసారని రాజమండ్రి ఫిజియో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డా. పిడిఎంఎల్ నాయుడు, డా. ఎన్. నాగరాజు, కన్వీనర్ డా. జె. రోహిణికుమార్ తెలిపారు. 4 వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ఈ పోటీలను వైఎస్సార్ సిపి రాజమండ్రి పార్లమెంట్ కో ఆర్డినేటర్ మార్గాని భరత్ ప్రారంభిస్తారు. స్వతంత్ర కాలేజ్ ఆఫ్ ఫిజియో థెరపీ ప్రిన్సిపాల్ డా. పి అప్పారావు, కిమ్స్ ఫిజియో థెరపీ కాలేజీ ప్రిన్సిపాల్ డా. సి. అశోక్, వైఎస్సార్ సిపి రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు తదితర ప్రముఖులు హాజరవుతారు. ఈ పోటీలోమొత్తం 8 టీములు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. 6 వ తేదీ ఆదివారం సాయంత్రం ముగింపు సభ, గెలిచిన టీములకు బహుమతి ప్రదానం ఉంటాయని డా. జాకబ్, డా. మురళీకృష్ణ, విల్సన్ తెలిపారు. విన్నర్ టీమ్ కి రూ. 15,000, రన్నర్ టీమ్ కి రూ. 10,000 నగదుతో పాటు ట్రోఫీలు ప్రదానం చేస్తారు. మాన్ అఫ్ ది మ్యాచ్, మాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డును ఉంటాయని, హాజరయ్యే ఆటగాళ్లకు భోజన వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని పోటీల కన్వీనర్ డా.రోహిణికుమార్ చెప్పారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం