సీఎం ని చేయండని పవన్ పిలుపు


నన్ను ముఖ్యమంత్రిని చేయండి. బాధ్యతగా పనిచేయకపోతే చొక్కా పట్టుకుని నిలదీయండి’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే బాధ్యతగల పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు. తనను ముఖ్యమంత్రిగా చూడాలని యువత కోరుకుంటోందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి కూడలిలో శనివారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే జనసేనతోపాటు సీపీఎం, సీపీఐలను పిలవండి. హోదాపై మాట్లాడదాం.. ఉమ్మడిగా పోరాడదాం’ అని తెదేపాకు సూచించారు. ప్రధాని మోదీతో గొడవపెట్టుకునేంత నైతిక బలం తెదేపాకు లేదని, ఆ శక్తి జనసేనకే ఉందని చెప్పారు. కాంగ్రెస్‌తో కలిసేందుకు తెలుగుదేశం నాయకులకు ఆత్మాభిమానం, పౌరుషం లేవా? అని ప్రశ్నించారు. తన వియ్యంకుడికి కాంట్రాక్టులు ఇప్పించుకోవడంపై మంత్రి యనమల రామ కృష్ణుడు చూపిన ఆసక్తి, చొరవను ప్రత్యేక హోదా సమావేశానికి ముఖ్యమంత్రిని ఒప్పించడానికి చూపాలని సూచిం చారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా కన్నీటి గాథలే ఉన్నాయని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద వేల కోట్లు లేవని, ప్రజల మనసు దోచుకునే ప్రేమ ఉందని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాలనూ సమానంగా చూడగల మనసున్న వాడినని తెలిపారు. అధికారంలోకి వస్తే రైతులు, కౌలు రైతుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం