ఎంపీల ప్రగతి పై మోదీ దృష్టి


ప్రధానమంత్రి నరేం‍ద్ర మోదీ ఏం చేసినా ఒక విజన్, వ్యూహం ఉంటాయి. ఇప్పుడాయన దృష్టి అంతా 2019 లోక్‌సభ ఎన్నికలపై కేంద్రీకృతమై ఉంది. గత నాలుగేళ్ల కాలంలో నియోజకవర్గాల్లో సాధించిన ప్రగతిని వివరించాలంటూ తాజాగా ప్రధాని మోదీ పార్టీ ఎంపీలకు సూచించారు. ప్రజలకు అందించిన మౌలిక సదుపాయాల కల్పన, కీలకమైన విజయాలు, సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి చేసిన ప్రత్యేక కృషిపై ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఇవ్వాలని ఆయన ఎంపీలకు తెలిపారు. అలాగ ఆయన సెల్ఫ్ అప్రైజల్స్ కూడా కోరినట్టు తెలిసింది. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వివిధ ప్రాజెక్టులపై ప్రజల అభిప్రాయాలను సేకరించాలని ఆయన తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. ఇటీవల ప్రధాని మోదీ తన గుడ్ మార్నింగ్ మెసేజ్ పై ఐదారుగురు ఎంపీలు మాత్రమే స్పందించారని చెప్పగా.. కొందరు మీడియా వాళ్ళు కామెడీ చేసే ప్రయత్నం చేసారు. ప్రధాని అడిగి మరీ గుడ్ మార్నింగ్ చెప్పించుకుంటున్నారని పాపం వారు అపోహకు లోనయ్యారు. అయితే ప్రధాని ఈ మెసేజ్ తో పాటు ఒక కీలక సందేశాన్ని కూడా సభ్యులకు పంపారు. ఫలితంగా ఇప్పటికి 250 మంది బీజేపీ ఎంపీలు నమో యాప్‌ను తమ స్మార్ట్‌ ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం