జన్మభూమి ఫిర్యాదులన్నీ పరిష్కరించాలి


ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని, ఒక్క ఫిర్యాదు పెండింగ్ లో ఉన్నా ఒప్పుకోనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను హెచ్చరించారు. 11వ తేదీకల్లా అన్ని ఫిర్యాదులు రియల్ టైంలో పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు, ఉద్యోగుల్లో అవగాహన పెరగాలని, సాధికారమిత్రల సహకారంతో ఫిర్యాదుదారులను గుర్తించాలని అన్నారు. విశాఖపట్నం నుంచి జన్మభూమి నోడల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.జన్మభూమి కార్యక్రమం ప్రపంచం అంతటినీ ఆకర్షిస్తోందని.. ఇది గర్వపడాల్సిన అంశమని అన్నారు. మూడో రోజున విశాఖ అర్బన్, చెరుకుపల్లి, విస్సన్నపేట, పెద్దాపురం, కడియం, యలమంచిలి, మొవ్వ, పెందుర్తి మండలాలు టాప్ టెన్ జాబితాలో ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.మిగిలిన మండలాలు కూడా ఆ స్థాయికి చేరుకోవాలని, ఒకరితో మరొకరు పోటిబడాలని పిలుపునిచ్చారు. మొత్తంగా కాకుమాను, పాలకొల్లు, పొన్నూరు, మేడికొండూరు, రాజాం, ఉంగుటూరు, పెడన, కసింకోట, పామిడి గ్రామాలు టాప్ టెన్ జాబితాలో ఉన్నాయని తెలిపారు. తొలి మూడురోజులు జన్మభూమి అద్భుతంగా జరిగిందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.

ముఖ్యాంశాలు