ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్


పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 29 నుంచి మొదలవుతాయి. 2018 -19 సంవత్సర కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి 1 వ తేదీన సమర్పిస్తారు. పార్లమెంటరీ వ్యవ్యహా రాల క్యాబినెట్ కమిటీ ఈ మేరకు సిఫారసు చేసినట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి అనంతకుమార్ చెప్పారు. కాగా బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. అదే రోజు ఆర్థిక సర్వే వివరాలను కూడా సభలో ప్రవేశపెడతారు. ఈనెల 29 న మొదలయ్యే బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9 వరకు జరుగుతాయని.. ఆ తర్వాత విరామం ఇచ్చి మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు మలివిడత సమావేశాలు జరుగుతాయన్నారు. ఈ తేదీల వివరాలను రాష్ట్రపతికి పంపిస్తారని అనంతకుమార్ వెల్లడించారు.

ముఖ్యాంశాలు