గణనీయంగా పెరిగిన పన్ను చెల్లింపుదారులు


ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుదారుల జాబితాలో ఈ ఏడాది ఇంతవరకూ (ఇంకా నాలుగు మాసాల వ్యవధి ఉంది) కొత్తగా 75 లక్షల మంది ఫైళ్లు చేరినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. కేంద్ర పన్నుల శాఖ బోర్డు డైరెక్టరేట్ (సీబీడీటీ) వచ్చే యేడాది మార్చి నెలతో ముగిసే 2018-19 ఆర్థిక సంవత్సరాంతానికి 1.25 కోట్ల కొత్త పన్ను చెల్లింపుదారులను జాతీయ జాబితాలోకి చేర్చాలన్నది లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. ఇందుకోసం సీబీడీటీ ఆదాయ పన్ను శాఖకు ఓ విధానాన్ని పెట్టింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు 75 లక్షల మంది కొత్త ఆదాయపన్ను చెల్లింపుదారుల ఫైళ్లను జాబితాలో చేర్చారు. పన్ను చెల్లింపులకు సంబంధించిన అంశాల పరిశీలనకు వివిధ ఎన్ఫోర్స్‌మెంట్ పద్ధతులను అమలు చేసినట్లు శాఖ వర్గాలు తెలిపాయి. ఇంకా కొన్ని నెలల కాలవ్యవధి ఉన్నందున 1.25 కోట్ల పన్ను చెల్లింపు దారులను జాబితాలో చేర్చాలన్న లక్ష్యాన్ని అధిగమిస్తామన్న ధీమా అధికారుల్లో వ్యక్తమవుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖ కొత్తగా 1.06 కోట్ల పన్ను చెల్లింపుదారులను జాతీయ జాబితాలో చేర్చింది. పన్ను ఫైలింగ్ చేయనివారి కోసం ఈ యేడాది ఆరంభంలో కొత్త ఆదాయపన్ను ఫైలర్లను ఏర్పాటుచేసింది. ఈ పన్ను చెల్లింపు విధానం ద్వారా ఆదాయ పన్ను రిటర్న్స్ సమర్పించే వ్యక్తులు ఇదే సందర్భంలో తమకు రావలసిన మినహాయిం పులు కోరే వెసులుబాటును కల్పించారు. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసుకునే వ్యక్తుల ఆదాయం పూర్తిగా శాఖ ఆమోదయోగ్యతను కలిగివుంటుందని ఐటీ అధికారులు అంటున్నారు. ఈ యేడాది వార్షిక లక్ష్యాలను వివరిస్తూ సీబీడీటీ ఆదాయ పన్ను శాఖ విజన్ డాక్యుమెంట్ (సీఏపీ)ని విడుదల చేసింది. హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశీర్‌లను కొత్తగా 11,48,489 ఫైళ్ల జాబితాలో చేర్చాలంటూ లక్ష్యంగా నిర్ధేశించడం జరిగింది. అలాగే పూనే ప్రాంతానికి 11,33,950 ఫైళ్లు, తమిళనాడు ప్రాంతానికి 11.36.645 కొత్త ఫైళ్లు, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు 10,36,645 కొత్త ఫైళ్లు చేర్చాలని లక్ష్యం నిర్ధేశించారు. గత ఆర్థిక సంవత్సరం 1.06 కోట్ల మంది... ఈ ఏడాది ఇంతవరకు 75 లక్షలమంది కొత్తగా ఆదాయపు పన్ను చెల్లింపుదారుల జాబితాలోకి వచ్చారు. మార్చి నాటికి ఈ ఏడాది ఫైళ్ల సంఖ్య 1.25 కోట్లు చేయాలనేది లక్ష్యం. అంటే ఈ రెండేళ్లలో మొత్తం రెండు కోట్ల పాతిక లక్షల మంది కొత్తగా పన్ను కట్టే స్థాయికి ఆదాయాన్ని పెంచుకున్నారన్నమాట. లాజికల్ గా ఆలోచించండి. ఆదాయపు పన్ను పరిధిని మతంలో కంటే ప్రభుత్వం ఏమీ తగ్గించలేదు. అంటే ఆదాయం లేకపోయినా ముక్కు పిండి వసూలు చేసే పన్నేమీ కాదు ఇది. పైగా రిటర్న్స్ స్వచ్చందంగా సమర్పించి కడుతున్న పన్నులే ఎక్కువ. సరైన ఆదాయం లేని వ్యక్తినుంచి ఏ పన్నునైనా వేయొచ్చు, ప్రభుత్వం ఎంతయినా వేధించవచ్చు గానీ... ఒక్క ఆదాయపు పన్ను మాత్రం వేయలేదు. ఆదాయపు పన్ను పరిధిలోకి ఒకడు రావాలంటే ఒక్కటే ప్రాతిపదిక.. ఆదాయం ఉండడమే! ఉదాహరణకి ఒకడు ఆదాయపు పన్ను పరిధిలో లేడనుకుందాం. వాడికి నిజంగా ఆదాయం లేకపోతే ఐటీ రైడ్లు చేసినా, నోటీసులిచ్చినా.... కేసులు పెట్టినా కూడా ప్రయోజనం ఉండదు.. అసలు ఆ పని ఐటీ శాఖా చేయనే చేయదు. పన్ను కట్టాల్సిన పరిధికి మించి ఆదాయం ఉంది... కట్టని వాడ్ని, కొండంత ఆదాయం ఉండి.. గోరంత పన్ను కట్టే వాడ్ని మాత్రమే ఐటీ శాఖా పట్టిం చుకుంటుంది తప్ప పేదోళ్ళని, మధ్యతరగతి వాళ్ళని కాదు కదా! ఇంకా.. ఇప్పటికీ ఆదాయాన్ని తక్కువ చూపి అరకొర పనులు కట్టేవాళ్లే ఎక్కువ తప్ప నిజంగా ఆదాయం లేని ఒక్క వ్యక్తిని కూడా ఈ పన్ను పరిధిలోకి బలవంతంగా తేవడం ఎవరికీ సాధ్యం కాదనేది సుస్పష్టం. మోదీ వచ్చాకా దేశం బాగుపడిందా, పాడైపోయిందా? ఇదొక క్లిష్టమైన ప్రశ్న చాలామందికి. దీనికి అందుబాటులోఉన్న ఈ అధికారిక గణాంకాల ఆధారంగా విశ్లేషించుకుంటే చాలదా? ఏ దేశ పురోగతిని అయినా ఆ దేశ పౌరుల తలసరి ఆదాయాన్ని బట్టే కదా అంచనా వేస్తారు!

ముఖ్యాంశాలు