సచివాలయంలో చిరుత


గుజరాత్‌ రాష్ట్ర సచివాలయంలోకి సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఓ చిరుతపులి ప్రవేశించింది. సెక్రటేరియట్‌ ఏడో నంబరు గేటు కింద నుంచి ఓ చిరుత లోపలికి చేరుకుంది. చిరుత సచివాలయంలోకి రావడం అక్కడి సీసీటీవీల్లో రికార్డ యింది. మరో కెమెరాలో చిరుత బయటకు వెళ్లినట్లుగా కన్పిస్తోంది. విషయం తెలుసు కున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి చిరుత కోసం గాలిస్తున్నారు. దాదాపు 100 మందికి పైగా సచివాలయానికి చేరుకుని గాలింపు చేపట్టారు. బోన్లు, మత్తుమందు ఇంజక్షన్లు ఇచ్చే తుపాకులను కూడా తీసుకొచ్చారు. రాష్ట్ర రాజధానిలో అత్యంత భద్రత నడుమ ఉండే సచివాలయంలోకి ఓ చిరుత రావడం కలకలం రేపుతోంది.

ముఖ్యాంశాలు