బాకీలు కట్టేస్తాను మహాప్రభో!


మోడీ సర్కారు కనబడని ఒత్తిడితో ఆర్ధిక నేరగాళ్ళని దారికి తెస్తోంది. ఇందుకు విజయ్ మాల్యా ఉదంతమే నిదర్శనం. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు నయా పైసాతో సహా తిరిగి చెల్లిస్తానని, దయచేసి బకాయిలు తీసుకోండి అంటూ బ్యాంకులు, భారత ప్రభుత్వానికి మొర పెట్టుకున్నాడు ఎగవేతదారుడు విజయ్ మాల్యా. పలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయినట్లు మాల్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాను ఎగవేతదారుని కాదని, 100శాతం రుణాలు చెల్లిస్తానని ఇపుడు మాల్యా చెబుతున్నాడు. రుణాల చెల్లింపుల కోసం కర్ణాటక హైకోర్టు ముందు నేను రాజీ ప్రస్తావన తెచ్చాను. దాని గురించి ఎవరూ ఎందుకు గట్టిగా మాట్లాడట్లేదు’ అని మాల్యా ట్వీట్‌ చేశారు. విమాన ఇంధన ధరలు ఎక్కువగా ఉండటం తో విమానయాన సంస్థలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్‌ కూడా అలాంటి సమస్యల్లోనే చిక్కుకుంది. చాలా నష్టాలను చవిచూసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బు కూడా పోగొట్టుకున్నాం. కానీ నేను తీసుకున్న మొత్తాన్ని 100శాతం తిరిగి చెల్లిస్తానని చెబుతున్నా. దయచేసి తీసుకోండి. మూడు దశాబ్దాల పాటు భారత్‌లోనే అతిపెద్ద మద్యం విక్రయాల సంస్థగా పేరొంది దేశ ఖజానాకు రూ. వేల కోట్లు ఇచ్చాం. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ ద్వారా కూడా రాష్ట్రాలకు చాలా మొత్తమే చెల్లించాం. బాగా నడిచిన ఎయిర్‌లైన్‌ నష్టాల్లో కూరుకుపోవడంతో సమస్యలు మొదలయ్యాయి. అయినా కూడా ఇప్పటికే నేను డబ్బు చెల్లిస్తా ననే చెబుతున్నా. ఎందుకంటే అది ప్రజల డబ్బు. దయచేసి ఆ బకాయిలు తీసుకోవాలని బ్యాంకులు, ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని మాల్యా తన వరుస ట్వీట్లలో వాపోయాడు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం