అన్యమత ఉద్యోగులపై టిటిడి చర్యలు


తితిదే ఉద్యోగుల్లో అన్యమతస్థులు, అన్యమత కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు దిశగా దేవస్థానం యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఇంతవరకూ ఈఓ సేకరించిన సమాచారం ప్రకారం 43 మంది అన్యమత కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు తేలింది. వీరిని ప్రభుత్వంలో ఇతర శాఖలకు బదిలీ చేయాలనే విన్నపానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అలాగే ఇకపై ప్రతి ఉద్యోగి తిరునామం ధరించి విధులకు రావాలనే షరతును విధించి, కచ్చితంగా అమలయ్యేలా చూడాలని తితిదే యాజమాన్యం నిర్ణయించింది.

ముఖ్యాంశాలు