ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ఆమోదం


పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణానికి ఆమోదం లభించింది. ప్రధాన డ్యాంతో జత చేయకుండా 2300 మీటర్ల పొడవునా దీన్ని నిర్మించుకోవచ్చని డ్యాం డిజైన్ల కమిటీ చెప్పింది. కేంద్ర జలవిద్యుత్తు పరిశోధన కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) కమిటీ సమర్పించిన ప్రతిపాదనలు ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేసింది. జెట్‌ గ్రౌటింగ్‌ పనులు ప్రారంభించుకునేందుకు అనుమతించింది. కాఫర్‌ డ్యాం డిజైన్ ఇచ్చి ఆమోదం పొందాలని సూచించింది. దీంతో రెండు నెలలుగా పెండింగులో ఉన్న ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. దిగువ కాఫర్‌ డ్యాంలో జెట్‌గ్రౌటింగు పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. దిల్లీలో శుక్రవారం మధ్యాహ్నం పాండ్యా నేతృత్వంలో పోలవరం డ్యాం ఆకృతుల కమిటీ భేటీ జరిగింది. ఏపీ జలవనరులశాఖ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం పర్యవేక్షక అధికారి వేమన రమేష్‌బాబు తదితరులు హాజరయ్యారు.

ముఖ్యాంశాలు