రిపబ్లిక్ డే క్లోజర్ ... 1000 విమానాల రద్దు


గణతంత్ర దినోత్సవ వేడుకలు పౌర విమానయానానికి చుక్కలు చూపించనున్నాయి. దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం గణతంత్ర దినోత్సవ సందర్భంగా సుమారు వెయ్యి విమాన సర్వీసులను రద్దు చేయనుంది. ఈ మేరకు విమానయాన సంస్థలకు నోటీసు లు అందాయి. జనవరి 18 నుంచి 26 వరకు రోజూ గంట 45 నిమిషాల పాటు (ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు) విమాన సేవలు ఉండబోవు. దీంతో ఆయా సమయాల్లో వెళ్లాల్సిన విమాన సర్వీసులు రద్దు కానున్నాయి. గతంలో గణతంత్ర దినోత్సవం సమయంలో ఆరు రోజుల పాటు విమానాలను రీషెడ్యూల్‌ చేసేవారు. ఈసారి విమాన సర్వీసులను రద్దు చేశారు అదీ తొమ్మిది రోజులకు పెంచారు. రిపబ్లిక్‌ డే క్లోజర్‌ పీరియడ్‌గాపిలిచే ఈ సమయంలో విమానాల రద్దు వలన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని విమానయాన సంస్థలు పేర్కొంటు న్నాయి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం