రజని, కమల్ కలిస్తే ఆ కిక్కే వేరు!


రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైన ఇద్దరు అగ్ర హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ ఓ వేడుకలో కలిసి పాల్గొన్నారు. నడిఘర్‌ సంఘం మలేషియాలో ఏర్పాటు చేసిన స్టార్‌ నైట్‌ షోకు కమల్‌, రజనీ ఒకే హెలికాఫ్టర్ లో వెళ్లారు. అనంతరం కలిసి వేదిక పంచుకున్నారు. వీరితో పటు పలువురు తమిళ నటీనటవర్గం కూడా ఇందులో పాల్గొన్నా వీరిద్దరే స్టార్ అట్రాక్షన్ గా నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు రజనీ ఇటీవల వెల్లడించారు. అయితే అంతకుముందు రజనీ రాజకీయ ప్రవేశంపై కమల్‌ తనదైన శైలిలో విమర్శలు కూడా చేసారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ వేదిక పంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది,

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం