కేసీఆర్ వ్యాఖ్యల ఆంతర్యంపై పౌరుడి స్పందన!


తెలంగాణ ముఖ్యమంత్రి చంద్ర‌శేఖ‌ర‌రావు చేసిన కొన్ని వ్యాఖ్య‌ల‌కు ఒక పౌరుడి స్పంద‌న‌.. 1. అమెరికా లో రాష్ట్రాల పైన కేంద్రం పెత్తనం ఉండదు.. మనది పేరుకే ఫెడరల్ వ్యవస్ధ * మనది ఫెడరల్ వ్యవస్థ అని రాజ్యాంగం లో ఎక్కడ చెప్ప లేదు.. రాజ్యంగ నిపుణులు, రాజనీతి శాస్త్ర పండితులు మనది ఫెడరల్ స్వభావం కలిగిన బలమైన కేంద్రం కలిగిన రాజ్యాంగం అని పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన వివిధ దేశాల వ్య‌వ‌స్థ‌లను సుదీర్ఘంగా అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత మ‌న దేశానికి అనుగుణంగా మన రాజ్యాంగ రచన చేశారు. 2. అన్ని అధికారాలు కేంద్రం చేతిలోనే ఉన్నాయి.. కేంద్రానికి పరిమిత అధికారాలు ఉండాలి. మిగతా వన్నీ రాష్ట్రాలకు బదలాయిన్చాలి... * అధికారాల కోసం కేంద్రంను అడుగుతున్నారు స‌రే.. మ‌రి రాష్ట్రంలో స్థానిక‌ సమస్థలకు ఎందుకు ఈ అధికారాలు బదలాయించ‌లేదు? ఆ సంస్థల పైన రాష్ట్ర పెత్తనం ఎందుకు?.. మీకు ఫోన్ చేసి అభినందించిన‌ మమతా బెనర్జీ (నిజ‌మేనా?) చిన్న రాష్ట్రాలను ఎందుకు వ్యతిరేకించింది. బెంగాల్‌లో స్థానిక సంస్థ‌ల‌కు ఆమె బదలాయించిన అధికారాలు ఏమిటి? 3. చైనా అభివృద్ధి పని విధం గురించి పొగుడుతున్నారు.. * భార‌త్‌లో మాట్లాడినట్టు క‌మ్యూనిస్టు నియంతృత్వ‌ చైనాలో మాట్లాడే స్వేచ్చ ఉండ‌దు. దేశ అధ్యక్షుడు జీవిత కాలం పదవిలో ఉండే విధంగా అక్కడ రాజ్యంగాన్ని మారుస్తున్నారు. మీరు కోరుకుంటున్నది ఇదేనా? అమెరికా, జపాన్ లో, బ్రిటీష్లో రెండు పార్టీల వ్యవస్థ. మీరు కూడా దీన్ని కోరుకుంటున్నారా ? 4. ప్ర‌ధాని మోదీని విమ‌ర్శిస్తే నన్ను జైలుకు పంపుతారా? * మ‌రి తెలంగాణ‌లో మీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తే కేసులు పెట్ట‌డం లేదా? కోదండరామ్ మీటింగు పెట్టుకోవటానికి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు?.. మీరు మాత్రం అందరినీ నోటికొచ్చినట్లు తూలనాడవచ్చు. కానీ అవతలి వారి విమర్శలను మాత్రం తట్టుకోలేరు.. 5. తెలంగాణ‌లో బీజేపీ ఉన్న‌దా? ఉనికి లేకుండా చేస్తా.. * త్రిపురలో మానిక్ సర్కార్ కూడా ఎన్నికల ముందు ఇలాగే అన్నారు.. చివరికి ఏమైంది?.. ఫలితం చూశారు కదా.. ఈశాన్య రాష్ట్రాల ఫలితాలతో దిమ్మ తిరిగి మీరు ఇలా మాట్లాడ‌టం నిజం కాదా? వైద్యుడు ఇచ్చే మందు పని చేయటానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. ఈ స‌మ‌యం కూడా ఇవ్వకుండా వైద్యుడిని మారిస్తే రోగే నష్ట పోతాడు త‌ప్ప వైద్యునికి ఏమీ కాదు. డీమోనిటైజేషన్, GST వంటివి మంచివి కాబట్టి సమర్ధించాను అని చెప్పారు. మ‌రి ఫలితం కోసం ఆగ‌కుండా ఇలా యుద్దాల‌కు దిగ‌డం స‌మ‌స్య‌కు ప‌రిష్కార‌మా?

ముఖ్యాంశాలు