విదేశీ పౌరసత్వానికి నో చెప్పిన  రెహమాన్


ఒండోరియా (కెనడా)లో ఏఆర్‌ రెహమాన్‌ పేరిట ఓ వీధి ఉంది. ఆయనకి అక్కడ పెద్దసంఖ్యలో అభిమానులు ఉన్నారు. విదేశీ పౌరసత్వాల కోసం ఈమధ్య కొందరు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తెగ ఎగబడుతున్నారు. వీటికి ఇప్పుడు గౌరవ డాక్టరేట్ల తరహాలో చాలా డిమాండ్ తలెత్తింది. అయితే రెండేళ్ల క్రితం కెనడా రెహమాన్ కి పౌరసత్వాన్ని ఇస్తానని ముందుకొచ్చినా ఆయన హుందాగా వద్దన్నారు. రెండేళ్ల క్రితం కెనడా మేయరు రెహమాన్‌ మన సంగీత కళాకారుడు ఏఆర్‌ రెహమాన్‌కు చట్టబద్ధంగా పౌరసత్వాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయితే అందుకు ఏఆర్‌ రెహమాన్‌ స్పందిస్తూ ‘కెనడా మేయరు నాకు పౌరసత్వాన్ని ఇవ్వాలనుకున్నందుకు కృతజ్ఞతలు. నేను ఆయనకు రుణపడి ఉన్నా. కానీ తమిళనాడులో నేను చాలా సంతోషంగా ఉన్నా. భారతదేశమే నా కుటుంబం. స్నేహితులు, నా ప్రజలు ఇక్కడే ఉన్నారు. మీరు ఇండియాకు వచ్చేటప్పుడు తప్పకుండా నా సం గీత కళాశాలకు విచ్చేయండి. ఇండియా, కెనడా సంయుక్త ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించడానికి చాలా ఆసక్తిగా ఉన్నా’నని సందేశంలో పేర్కొన్నారు. ఈ స్పందన రెహమాన్ దేశభక్తికి అద్దం పడుతోందని ఆయన అభిమానులు చెబుతున్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం