చిన్ననాటి స్కూల్ లో రామ్ చరణ్


చిన్ననాటి జ్ఞాపకాలు ఎవరికైనా మధురానుభూతిని కలిగిస్తాయి. పాఠశాల రోజులైతే మరీను. హీరో రాంచరణ్‌ ఇటీవల తమిళనాడు వెళ్లి చిన్నప్పుడు తాను చదువుకున్న లారెన్స్‌ స్కూల్‌ను సందర్శించారు. దానికి సంబంధించిన ఫొటోలను తన భార్య ఉపాసనకి ట్విటర్‌ లో పంపితే ఆమె షేర్ చేసుకున్నారు. స్కూల్‌ క్యాంటీన్‌, డార్మెటరీ, తరగతి గదులతో పాటు పాఠశాల పరిసరాలను చెర్రీ పరిశీలించారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అక్కడి విద్యార్థులతో ఫొటోలు దిగారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం