ఎన్నికల సొత్తు రూ.3.95 కోట్ల పట్టివేత

తెలంగాణాలో ఎన్నికల ఖర్చు కోసం అక్రమంగా దాచిన, తరలిస్తున్న కోట్లాది రూపాయల నగదు బయట పడుతోంది. వరంగల్‌లోని కాజీపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి భారీ ఎత్తున నగదు పట్టుబడిం ది. ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉన్న రూ.3.59 కోట్ల నగదును వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వర్ధన్నపేట మహాకూటమి అభ్యర్థి పి.దేవయ్యకు సంబంధించిన ఈ మొత్తాన్ని తర లిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన ప్రావిన్స్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.రవీందర్‌ మీడియాకు వెల్లడించారు. కాజీపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రావిన్స్‌రెడ్డి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని విచారించారు. అతడి వద్ద ఉన్న ఓ కవర్‌తో పాటు, రూ.2లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా.. ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన రూ.3,59,19,250 మొత్తాన్ని కాంగ్రెస్‌ నాయకుడు అమృతరావు ఇంటికి ఎదుగా ఉన్న ఓ ఇంట్లో ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బును సులువుగా పంపిణీ చేసేందుకు వీలుగా రూ.2లక్షలు చొప్పున ఒక కవర్‌ లో ప్యాక్‌ చేసే దానిపై అందాల్సిన కార్యకర్త, గ్రామం పేర్లు రాశారని రవీందర్‌ తెలిపారు. 

Facebook