ట్విట్టర్ లో లాలూ కేరాఫ్ జైలు


మమ్మల్ని అనుసరించండి. లేదంటే ఇరకాటంలో పెడతాం.. ఇది బీజేపీ సూత్రం. అయితే సామాజిక న్యాయం, సామరస్యత, సమానత్వం కోసం సంతోషంగా చనిపోవడానికి కూడా నేను సిద్ధమే.. ఇది లాలూ ప్రసాద్ యాదవ్ జైలు నుంచి ఇచ్చిన ట్వీట్. జైల్లో లాలూకి ట్విట్టర్ ఎలా అందుబాటులో ఉందా అని ఆశ్చర్య పోవద్దు. ఇది లాలూ మాయాజాలం! అయన జైల్లో ఉన్నప్పుడు ఆయన పేరుతోనే కుటుంబ సభ్యుల్ని సంప్రదించి ఇలాంటి ట్వీట్లు తన కార్యాలయం నుంచి వస్తాయని ఆయన ఇంతకుముందే చెప్పాడు. అయితే జైల్లో ఉన్న వ్యక్తి పేరుతొ ఇలాంటి ట్వీట్లు రావడాన్ని ట్విట్టర్ ఎలా అనుమతిస్తుంది.. ఈ పెడ పోకడలను కోర్టులు ఎలా అంగీకరిస్తాయనేది మరో ప్రశ్న! రేపు లాలూ పేరున అసత్యపు ట్వీట్లు వస్తే.. వాటి పర్యవసానంగా ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే ట్విట్టర్ బాధ్యత వహిస్తుందా... జైలు అధికారులు బాధ్యత వహిస్తారా లేక ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంటుందా? అన్నిటికంటే మరో ముఖ్య సందేహం.. ఎలాగూ జనం ఫిక్స్ అయిపోయారు కాబట్టి జైల్లో నిజంగానే లాలూకి ఇంటర్ నెట్ ఇస్తే మాత్రం ఏమిటి తేడా? ఇవే ట్వీట్లు ఆయన చేస్తాడు .. అంతేగా!

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం