తెలుగు భాష అందం అర్థమైంది : సూర్య

తమిళ హీరో సూర్య‌. విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన చిత్రం ‘గ్యాంగ్‌’. కీర్తిసురేష్ క‌థానాయిక‌. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా సూర్య విలేక‌రుల‌తో మాట్లాడారు. బాలీవుడ్‌లో విజయం సాధించిన ‘స్పెషల్‌ ఛబ్బీస్‌’కి ఇది రీమేక్‌. చాలా మార్పులు చేశాం. ఇందులోని అంశాలు కొత్త‌గా తీర్చిదిద్దాం. అని చెప్పారు. ఇందులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చినదన్నారు. ఈ చిత్రంలో తన  డైలాగులన్నీ ఓ కొత్త పంథాలో ఉంటాయని, డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు చాలా ఆస్వాదించానని చెప్పారు. డబ్బింగ్ చెబుతున్నపుడు తెలుగు భాషలోని అందం సొగసు అర్థం అయ్యాయన్నారు. త‌మిళంలో డ‌బ్బింగ్ కి 8 రోజులు ప‌డితే.. తెలుగులో మాత్రం 46రోజులు ప‌ట్టిందన్నారు. ఈ సినిమా త‌ర్వాత సెల్వ రాఘవన్ తో ఒక సినిమా, ఆ తర్వాత కె.వి. ఆనంద్ తో ఒక సినిమా చేస్తానని సూర్య తెలిపారు. 

Facebook
Twitter