కిమ్ తో రాజీకి అమెరికా రెడీ!?


అణ్వస్త్ర దేశంగా ఎదిగిన ఉత్తర కొరియాని చూసి మొదటికో గర్జించిన అమెరికా ఇప్పుడు మ్యావ్ మ్యావ్ అంటున్నది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో అమెరికా రాజీ యత్నాలకు దిగినట్టు కనిపిస్తోంది. ఉ.కొరియా వరుస క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో కొద్ది రోజులుగా ట్రంప్‌, కిమ్‌ మధ్య మాటల యుద్ధం సంగతి తెలిసిందే. ట్రంప్‌ శనివారం మేరీల్యాండ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిమ్‌తో మాట్లాడుతారా? అని మీడియా అడగ్గా తప్పక మాట్లాడతా.. నాకు అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే కొన్ని షరతులు ఉంటాయి. అని చెప్పారు. వింటర్‌ ఒలింపిక్స్‌ నేపథ్యంలో ద.కొరియా, ఉ.కొరియా మధ్య చర్చలు చాలా గొప్పవిషయం అమీ వ్యాఖ్యానించిన ట్రంప్ ఇది తన జోక్యం ఫలితమేనన్నారు. కాగా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ప్రతినిధులు రెండేళ్ల అనంతరం మొదటిసారిగా ఈ నెల 9న సమావేశం కానున్నారు. చర్చల కోసం సియోల్‌ ద్వారా కిమ్ కు వర్తమానం పంపడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. అమెరికా, దక్షిణ కొరియా నిర్వహించదలచిన సంయుక్తం సైనిక విన్యసాలు వాయిదా పడిన కొన్ని గంటల్లోనే ఈ సమావేశం ఖరారు కావడం గమనార్హం.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం