సచిన్ కుమార్తెకు బెదిరింపులు : వ్యక్తి అరెస్టు


ఎంపీ సచిన్‌ తెందూల్కర్‌ కుమార్తె సారాను కిడ్నాప్‌ చేస్తానంటూ ఓ యువకుడు బెదిరింపు కాల్స్‌ చేసినట్లు సచిన్ సహాయకుడొకరు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు నిందితుడ్ని పశ్చిమ్‌ బంగ మిద్నాపూర్‌కు చెందిన 32 సంవత్సరాల దేవ్‌ కుమార్‌ మిత్తిగా గుర్తించారు. అతను చదువు ఆపేసి, ఖాళీగా ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. గత నెల చివరి వారంలో సచిన్‌ ఇంటి ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి సారాను కిడ్నాప్‌ చేస్తానని, పెళ్లి చేసుకుంటానని అతడు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఫోన్‌ నంబర్‌ ఆధారంగా నిందితుడు ఉండే ఏరియాని గుర్తించారు. శనివారం ఉదయం అతడిని అరెస్ట్‌ చేశారు. ‘ఆమెను టెలివిజన్‌లో చూసి పెళ్లి చేసుకోవాలి అనుకున్నానని నిందితుడు తెలిపినట్లు సమాచారం. కాగా సారా ప్రస్తుతం సచిన్‌ విదేశాల్లో ఉన్నట్టు తెలిపారు.

ముఖ్యాంశాలు