ఎన్టీఆర్‌ బయోపిక్‌ లో అన్నీ ఉంటాయి - బాలయ్య


ఎన్టీఆర్‌ బయోపిక్‌ లో చాలా ఆసక్తికర విషయాలు ఉంటాయని బాలకృష్ణ తెలిపారు. ఎన్ టి ఆర్ అందరినీ ‘నా’ అనుకునేవారని, తాను అజాత శత్రువని ఆయన నమ్మేవార ని బాలయ్య తెలిపారు. కానీ ప్రతీ ఒక్కరి జీవితంలో ఆత్మీయులు, బంధువులు, స్నేహితులతో పాటు శత్రువులూ ఉంటారన్నారు. ఎన్టీఆర్ పుట్టినప్పటి నుంచీ చివరి వరకూ చరిత్ర మొత్తం ఈ బయోపిక్ లో ఉంటుందన్నారు. ఈ సినిమాలో తాను దాదాపు 62 గెటప్పుల్లో కనిపించబోతున్నట్టు బాలకృష్ణ వెల్లడించారు. ఏపీలో స్టూడియో నిర్మిస్తానని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేష్‌లో చాలా అందమైన లొకేషన్లు ఉన్నాయని, అయితే చిత్రసీమ మొత్తం హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలిపోవాలని కోరుకోకూడదన్నారు. తెలంగాణ అన్నా తెలుగువాళ్లే అని, రెండు తెలుగు రాష్ట్రాలూ చిత్రసీమకు రెండు కళ్లు అని ఆయన వ్యాఖ్యానించారు. తాను మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఓ స్టూడియో నిర్మిస్తానన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం